హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్....
- ABM వార్తలు
- Jan 13
- 1 min read

నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ వేడుకలో 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి కైట్ క్లబ్ సభ్యులు పాల్గొననున్నారు. ఈ వేడుకలో కైట్ ఫ్లయింగ్‌తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహించబడుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్వీట్లతో పాటు తెలంగాణ పిండి వంటలు ప్రదర్శించబడతాయి. ఈ వేడుకకు దాదాపు 15 లక్షల మందికి పైగా సందర్శకులు రానున్నారని అంచనా వేస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకను ప్రారంభించనున్నారు.
Comments