శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు:బీఆర్ నాయుడు
- ABM వార్తలు
- Jan 20
- 1 min read

శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలను అందించేందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆయన సూచనల ప్రకారం, మెనూలో కొత్త ఐటమ్‌ను చేర్చాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో, ట్రయల్ రన్‌లో భాగంగా, ఈ రోజు 5,000 మసాలా వడలు భక్తులకు వడ్డించబడ్డాయి. ఈ మసాలా వడలు ఉల్లిపాయలు మరియు వెల్లులి లేకుండా తయారు చేయబడ్డాయి. భక్తులు ఈ వడలను రుచికరంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
భక్తుల అభిప్రాయాలను పరిశీలించి, లోటుపాట్లను సరిచేసి, పూర్తిస్థాయిలో మెనూలో మార్పులు తీసుకొచ్చేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది.
Comments