కేంద్ర ఆర్ధిక మంత్రితో సీఎం భేటీ
- ABM వార్తలు
- Jan 24
- 1 min read

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, ఆర్థికసాయం, అమరావతికి హడ్కో రుణం, వరల్డ్ బ్యాంక్ సాయం వంటి విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని ముఖ్యమైన అంశాలను కేంద్రమంత్రికి వివరించారు.
రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
అమరావతికి సంబంధించి హడ్కో నుండి రుణం పొందడం గురించి చర్చించారు.
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన వరల్డ్ బ్యాంక్ సాయాన్ని కూడా కేంద్రమంత్రికి వివరించారు.
అనంతరం, సీఎం చంద్రబాబు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.
Comments