ఏపీ లో ఉచిత బస్సు ప్రయాణం :మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- ABM వార్తలు
- Jan 16
- 1 min read

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలులోకి రానుంది. మహిళలకు 3 సిలిండర్లు, 64 లక్షల మందికి పింఛన్లు అందించడం వంటి సంక్షేమ పథకాలు కూడా కొనసాగుతాయి అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం మరో 2 నెలల్లో అమలవుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
Comments